రేజర్లు, పోర్న్ మ్యాగజైన్లు, గుట్కా ప్యాకెట్లు.. స్కూల్ బ్యాగుల్లో.. కాఫీ కలర్ అట్ట ఉన్న బుక్ ను తెరచిన అధికారులు..!

రేజర్లు, పోర్న్ మ్యాగజైన్లు, గుట్కా ప్యాకెట్లు.. స్కూల్ బ్యాగుల్లో.. కాఫీ కలర్ అట్ట ఉన్న బుక్ ను తెరచిన అధికారులు..!


స్కూలుకు వెళ్ళే పిల్లల బ్యాగులో ఏముంటాయి చెప్పండి.. పుస్తకాలు, పెన్నులు, బాక్సులు.. అలాంటివి..! కానీ లక్నోలోని స్కూలు పిల్లల బ్యాగులను చెక్ చేస్తే ఏమి బయటకు వచ్చాయో తెలుసా..? రేజర్లు, పోర్న్ మ్యాగజైన్లు, గుట్కా ప్యాకెట్ల కట్టలు.. ఇవి బయటకు వచ్చాయి. ఇంతకూ పిల్లల బ్యాగులను పరిశీలించాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా.. ఇటీవల లక్నోలోని బ్రైట్ లాండ్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఆరో తరగతి విద్యార్థిని కత్తితో దాడి చేసింది. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించగా షాకింగ్ వస్తువులు కనిపించాయి. ఆ కాలంలో మీ వయసులో మాకు ఇలాంటివి ఏవీ తెలీదు కదా అని ఆఫీసర్లే ఆశ్చర్యపోయారు.హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అధికారులు అధికారులు దాదాపు రెండు డజన్ల స్కూళ్ళలో స్పాట్ చెకింగ్ ను నిర్వహించారు. ఇతరులకు హాని చేసే వస్తువులు ఏవైనా పిల్లలు తీసుకొని వచ్చారా అని తెలుసుకోవాలన్నడే ఈ చెకింగ్ ముఖ్య ఉద్దేశ్యం.. కానీ పోర్న్ మ్యాగజైన్, రేజర్స్, షేవింగ్ ఫోమ్స్, లైటర్లు, సిగరెట్లు, బ్లేడ్లు, ఐపోడ్లు, మొబైల్ ఫోన్లు, చాలా స్లిమ్ గా ఉండే ల్యాప్ టాప్లు, గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి.తొమ్మిదో తరగతి కుర్రాడు కాఫీ కలర్ అట్ట వేసుకొన్న పుస్తకాన్ని చూశారు అధికారులు. దాని మీద సైన్స్ సబ్జెక్ట్ అని రాసి ఉంది. దీన్ని తెరచిన అధికారులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే అది ఓ పోర్న్ మ్యాగజైన్. అలాగే చాలా మంది అబ్బాయిల బ్యాగుల్లో నుండి సిగరెట్లు, లైటర్లు కూడా బయటపడ్డాయట.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు అందించారట..!గర్ల్స్ హైస్కూల్ లోనూ ఈ బ్యాగుల తనిఖీలు జరిగాయి. ఆడపిల్లలను బాత్ రూమ్ కి వెళ్ళమని చెప్పి.. వారి బ్యాగుల్లో ఏమున్నాయో తెలుసుకుందామని వెతికారు. వాళ్ల బ్యాగుల్లో కత్తెర్లు – బ్లేడ్లు – నెయిల్ పాలిష్ లు – లిప్ స్టిక్స్ – పర్ఫ్యూమ్స్- ఐపాడ్లు – మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి. ఒక్కో స్కూల్ లో దాదాపు 2500 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారని.. అందరి బ్యాగులూ చెక్ చేయాలంటే కష్టమేనని.. అదే తల్లిదండ్రులు తమ బిడ్డల బ్యాగుల్లో ఏమున్నాయో తెలుసుకోవడం చాలా ఈజీ అని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు





Comments