ఐదు మంది నిర్మాతలం, పడుకోవాలన్నారు!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ విషయంలో నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగికపరమైన ఒత్తిళ్లు తప్పవని ఇది వరకూ పలువురు హీరోయిన్లు చెప్పిన మాటనే శ్రుతి కూడా చెప్పింది. ఆ అనుభవం తనకే ఎదురైంది అని కూడా ఈమె వ్యాఖ్యానించడం గమనార్హం. తను నటించిన ఒక సినిమా రీమేక్ ప్రతిపాదన సమయంలో.. తనపై లైంగిక పరమైన ఒత్తిళ్లు వచ్చాయని శ్రుతి చెప్పింది.
అవి నా కెరీర్ బిగినింగ్ డేస్. నేను నటించిన ఒక కన్నడ సినిమా బాగా హిట్టైంది. దాన్ని రీమేక్ చేయడానికి ఒక తమిళ నిర్మాత హక్కులు కొనుక్కొన్నాడు. తమిళంలో కూడా హీరోయిన్ గా నటించమని నన్ను సంప్రదించారు. దానికి నేను సరే అన్నాను. ఆ సమయంలో అతడు మరో ప్రతిపాదన పెట్టాడు. తాము ఐదుగురం కలిసి ఆ సినిమాను రూపొందిస్తున్నామని.. షూటింగ్ జరిగినన్ని రోజులూ.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐదుగురం నిన్ను మార్చుకుంటాం... అని అతడు అన్నాడు. అతడి ప్రతిపాదన విని నేను వెంటనే కాల్లో చెప్పు తీసి చూపించా..’ అని శ్రుతి వివరించింది.
తను తీవ్రంగా స్పందించడంతో ఆ సినిమా అవకాశం తన చేజారిందని, ఆ తర్వాత తమిళంలో అవకాశాలు కూడా పెద్దగా రాలేదని శ్రుతి పేర్కొంది. అయితే ఆ ప్రతిపాదన తెచ్చిన సదరు నిర్మాత పేరును ఈమె ప్రస్తావించలేదు. మరోవైపు శ్రుతి వ్యాఖ్యలపై కన్నడ నాట స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఇన్నాళ్ల తర్వాత ఈ విషయం చెప్పడం ఏమిటని.. కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కొందరు వ్యాఖ్యానించారు.

Comments
Post a Comment