బాలిక‌పై అత్యాచారానికి త‌న ప్రియుడికి స‌హ‌క‌రించిందంటూ దాడి: ఆసుప‌త్రిలో..

బాలిక‌పై అత్యాచారానికి త‌న ప్రియుడికి స‌హ‌క‌రించిందంటూ దాడి: ఆసుప‌త్రిలో..!


ఆసుప‌త్రి బాత్‌రూమ్‌లో ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లా ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు స్వాతి హోస‌మ‌ని.త‌న ప‌క్కింట్లో ఉండే ఓ బాలికపై అత్యాచారం చేయ‌డానికి త‌న ప్రియుడికి స‌హ‌క‌రించింద‌నే ఆరోప‌ణ‌లు ఆమె మీద ఉన్నాయి. ఆ ఆరోప‌ణ‌ల‌తోనే స్థానికులు ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు.గాయ‌ప‌డిన స్వాతి రెండురోజుల కింద‌ట చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరారు. అక్క‌డ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆసుప‌త్రి జ‌న‌ర‌ల్‌వార్డు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.విజ‌య‌పుర తాలూకా ప‌రిధిలోని హోన‌గ‌న‌హ‌ళ్లికి చెందిన సురేష్ అనే యువ‌కుడు.. మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాధిత బాలిక పొరుగింట్లో ఉండే స్వాతి ఇందుకు స‌హ‌క‌రించిందనే ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. గ్రామ‌స్తులు ఆమెపై దాడి చేశారు.ఇద్ద‌ర్నీ విజ‌య‌పుర రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు. సురేష్‌, స్వాతి ఏకాంతంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో.. బాధిత బాలిక వారిద్ద‌ర్నీ చూసింద‌ని, అందుకే ఆమెపై కుట్ర ప‌న్ని.. అత్యాచారం చేశాడ‌ని త‌ల్లిదండ్రులు, స్థానికులు పోలీసుల‌కు తెలిపారు.సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్వాతిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ గురువారం రాత్రి స్వాతి ఆసుప‌త్రి బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విజ‌య‌పుర గాంధీచౌక్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.






Comments