రంగస్థలంలో రంగమ్మత్తగా హాటీ
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని చాలాకాలం నుంచి చెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.. 1980ల కాలం నాటిని అద్దం పట్టబోతున్నాడని.. ఇప్పటి జనరేషన్ కు తెలియని అనేక విషయాలను చెప్పబోతున్నాడని ప్రీ లుక్ పోస్టర్లను చూస్తుంటేనే తెలుస్తుంది.
రంగస్థలంలో హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ సారి తన కాళ్లను మాత్రమే ఫోటోగా పోస్ట్ చేసి.. ఈ విషయాన్ని చెప్పింది అనసూయ. ఈ భామ రంగస్థలం మూవీలో పోషిస్తున్న పాత్రపై చాలానే మాటలు వినిపించాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ కు అత్తగా ఈ సినిమాలో అనసూయ కనిపిస్తుందనే టాక్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నా.. కాదంటూ అనసూయ రీసెంట్ గా ఖండించేసింది. అత్త పాత్ర కాదు కానీ.. ఈమె పోషిస్తున్న పాత్ర పేరు.. రంగమ్మత్త అని తెలుస్తోంది.
చుట్టరికం లేకపోయినా.. పల్లెటూళ్లలో వరుసలు పెట్టి పిలుచుకోవడం కనిపిస్తుంది. ఆ కాలంలో అయితే అసలు వరుస లేకుండా పిలుపే ఉండేది కాదు. మూడు దశాబ్దాల క్రితం పల్లెటూరి జీవితాన్ని అద్దం పడుతున్న సుకుమార్.. రంగమ్మత్త పాత్రలో అనసూయను చూపించబోతున్నాడట. విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఫిలిం కెరీర్ లో.. రంగమ్మత్త పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయే రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
Comments
Post a Comment