ప్రేమయాత్రలో పైశాచికం!

 ప్రేమయాత్రలో పైశాచికం! 

తనను ప్రేమించిన యువకుడు విహారయాత్రకు తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి హెచ్‌.ఎ.ఎల్‌. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడు దినేష్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు నగరంలోని బహుళ జాతి కంపెనీలో పనిచేసేవాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న యువతితో పరిచయమైంది. అది కాస్తా పేమగా మారింది. ఇటీవల ఇద్దరూ విహారయాత్రలకు మురుడేశ్వరకు వెళ్లారు. అక్కడ అద్దెకు గది తీసుకున్నారు. ‘ఇద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి కూడా చేసుకుందామంటూ మాయమాటలు చెప్పాడు. ఓ రాత్రి పానీయంలో మత్తుమందు కలిపి తాగించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు’ బాధిత యువతి తెలిపింది. అత్యాచార దృశ్యాల్ని చరవాణిలో చిత్రీకరించి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను అంతర్జాలంలో ఉంచుతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే నిందితుడికి ఇప్పటికే మరో యువతితో పెళ్లి నిశ్చయం కావడం గమనార్హం.



Comments