నేతాజీ సుభాష్ చంద్ర బోస్” తన పెళ్లిని “సీక్రెట్” గా ఎందుకు ఉంచారో తెలుసా.? ఇంతకీ ఎవర్ని పెళ్లి చేసుకున్నారు?

నేతాజీ సుభాష్ చంద్ర బోస్” తన పెళ్లిని “సీక్రెట్” గా ఎందుకు ఉంచారో తెలుసా.? ఇంతకీ ఎవర్ని పెళ్లి చేసుకున్నారు?


భార‌త‌దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది మ‌హానుభావుల్లో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ కూడా ఒక‌రు. దేశ పౌరులు ఎప్ప‌టికీ నేతాజీ త్యాగాన్ని, పోరాటాన్ని మ‌రువ‌లేరు. బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేలా వారిపై ఒత్తిడి తేవ‌డంలో నేతాజీ స‌ఫ‌లీకృతుల‌య్యారు. అంతేకాదు, విదేశాల్లో ఉన్న‌ప్ప‌టికీ త‌న ర‌చ‌న‌లు, లేఖ‌ల ద్వారా నేతాజీ భార‌త్‌లో ఉన్న పౌరుల్లో స్వాతంత్ర్యం కాంక్ష‌ను ర‌గిలించారు. చివ‌ర‌కు దేశ ప్ర‌జ‌ల‌కు క‌న్పించ‌కుండా క‌నుమ‌రుగ‌య్యారు. అయితే ఆయ‌న మ‌ర‌ణం ఇప్ప‌టికీ ఒక సందేహమే. ఆయ‌న మ‌ర‌ణి్ంచార‌ని కొంద‌రు, లేదు బ‌తికే ఉన్నార‌ని కొంద‌రు అంటుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న పెళ్లి గురించిన వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. నేతాజీకి పెళ్ల‌యింద‌ని, కానీ అది బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ద‌నే వార్త ఇప్పుడు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఆస్ట్రియాలో ఉన్న‌ప్పుడు ది ఇండియ‌న్ స్ట్ర‌గుల్ అనే పుస్త‌కాన్ని ర‌చిస్తున్నారు. అయితే ఆయ‌న‌కు టైప్ రైటింగ్ తెలిసిన‌, ఇంగ్లిష్ బాగా వచ్చిన వ్య‌క్తి అవ‌స‌రం అయ్యారు. దీంతో నేతాజీ స్నేహితుడైన డాక్ట‌ర్ మాథుర్ ఆస్ట్రియా దేశ‌స్తురాలైన Emilie Schenkl ను నేతాజీకి ప‌రిచ‌యం చేశారు. స్వ‌త‌హాగా ఎమిలీకి ఇంగ్లిష్ బాగా వ‌చ్చి ఉండ‌డం, టైప్ రైటింగ్ తెలిసి ఉండ‌డంతో నేతాజీ ఆమెను త‌న పుస్త‌క ర‌చ‌న కోసం నియ‌మించుకున్నారు. అయితే నేతాజీకి, ఎమిలీకి మ‌ధ్య అనుకోని బంధం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లికి దారి తీసింది. ఈ క్ర‌మంలోనే వారికి ఓ కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు అనిత‌.అయితే నేతాజీ పెళ్లి చేసుకున్న‌ది 1937వ సంవ‌త్స‌రంలో అని కొంద‌రు అంటుండ‌గా మ‌రో వైపు కొంద‌రు మాత్రం 1942లో ఆయ‌న‌కు పెళ్ల‌యింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకున్నాక నేతాజీ 1943లో ఓ సారి ఇండియాకు వ‌చ్చి నాజీ జ‌ర్మ‌నీ సైన్యంలో చేరార‌ని స‌మాచారం. అయితే బోస్ తన పెళ్లి గురించి గోప్యంగా ఉంచార‌ట‌. క‌నీసం ఇండియాలో ఉన్న త‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా త‌న పెళ్లి గురించి కూడా చెప్ప‌లేద‌ట‌. ఎందుకంటే.. ఆయ‌న స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నాడు క‌దా, క‌నుక శ‌త్రువుల నుంచి వారికి ఎక్క‌డ ఆప‌ద వ‌స్తుందోన‌ని ఆ వివ‌రాల‌ను నేతాజీ బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌నివ్వ‌లేదు. అయితే ఓసారి ఎమిలీ స్వ‌యంగా ఇండియాలో ఉన్న నేతాజీ సోద‌రుడు శ‌ర‌త్ చంద్ర బోస్‌కు లేఖ రాసింద‌ట‌. దీంతో బోసు పెళ్లి విష‌యం బ‌యటి ప్ర‌పంచానికి తెలిసింద‌ట‌. అయితే అస‌లు నిజానికి బోసుకు పెళ్లి కాలేద‌ని మాత్రం ఇంకా కొంద‌రు వాదిస్తున్నారు. ఏది ఏమైనా నేతాజీ పెళ్లి టాపిక్ మాత్రం ఇప్పుడు మీడియాలో, నెట్‌లో ఎక్క‌డ చూసినా చ‌ర్చనీయాంశ‌మ‌వుతోంది.




Comments