ముస్లింలు ఎవరూ ఆ సినిమా చూడొద్దు.. అదొక అశ్లీల చిత్రం అన్న అసదుద్దీన్ ఓవైసీ.. ఇంతకూ ఏ సినిమా..!
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఓ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను ముస్లింలు ఎవరూ చూడకూడదని.. అది ఒక అశ్లీల చిత్రమని అన్నారు.. ఇంతకూ ఏ సినిమా అని మీకు డౌట్ వస్తోందా..! అదేనండి దీపిక పడుకునే ముఖ్య పాత్ర పోషించగా.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’ సినిమా విషయంలో..!ఈ సినిమా ఒక కట్టు కథ అని.. దాన్ని ముస్లింలు ఎవరూ చూడవద్దని సూచించారు అసదుద్దీన్ ఒవైసీ. రాజ్ పుత్ రాణి పద్మావతి, రాజు అల్లావుద్దీన్ ఖిల్జీల కథ అంటూ ఈ సినిమా తీశారని ఈ సినిమా కోసం డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. పద్మావత్ లాంటి ఆశ్లీల చిత్రాన్ని చూడవద్దని మంచి పనులు చేసి, మంచి జీవితం గడిపేందుకే దేవుడు మనల్ని పుట్టించాడని అన్నారు. 1540 నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథే ఇది అని తెలిపారు.ఇప్పటికే ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు రాజ్ పుత్ కర్ణి సేనలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అలాగే చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పద్మావత్’పై రాజ్‌పుత్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి. తమ విన్నతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని ఆయా సంఘాల ప్రతినిధులు అన్నారు. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.






Comments
Post a Comment