ఇంటర్నెట్ వల్లే మాకు వర్షాలు పడటంలేదు ..కులుమనాలీ వాసుల ఆందోళన
ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే తమకు వర్షాలు పడటంలేదని హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో పడి ప్రజలు దేవుడిని కొలవడం మర్చిపోయారని అందుకే వర్షాలు పడటంలేదని అంటున్నారు. వర్షాలు పడాల్సిన సమయం వచ్చినప్పటికీ కులులో ఇప్పటివరకు వర్షపు చినుకులేదని చెబుతున్నారు.కులులో వర్షాలు పడకపోతే అక్కడి శిర్ఘన్ నాగ్ ఆలయంలో పూజలు చేస్తుంటారట. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతుండడంతో దేవుళ్లను పట్టించుకోవడంలేదని ఆవులను కూడా పూజించడంలేదని శిర్ఘన్ నాగ్ ఆలయ పూజారి నితిన్ శర్మ తెలిపారు. పూజారులు కూడా ఫోనులతో బిజీ అయిపోయారని ఆ కోపంతోనే దేవుడు వర్షాలు పడకుండా చేస్తున్నారని అక్కడి మీడియా వర్గాలతో తమ బాధను చెప్పుకొన్నారు.
Comments
Post a Comment