శాడిస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇలాగే ఉంటాడు మరి.. ఆరు గంటల పాటూ కొట్టాడు.
శాడిజానికి ప్రతి రూపం అతడు.. నమ్మి
వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ను ఆరు గంటల పాటూ చితక్కొట్టాడు. ఆమె చనిపోతున్నానని
అనుకుంది. చివరికి కుటుంబ సభ్యులకు ఒక లేఖ రాసి చనిపోతాను అని తన శాడిస్ట్ బాయ్
ఫ్రెండ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలింది. 22 సంవత్సరాల కిర్బీ వీగ్రామ్ తన బాయ్ ఫ్రెండ్ జొనాథన్ గ్రాహమ్ చేతిలో
చనిపోబోతున్నానని ఫిక్స్ అయిపోయింది. అతని ఫ్లాట్ కు వెళ్ళిన ఆమెకు నరకం అంటే
ఏమిటో చూపించాడు జొనాథన్. చివరికి ఎలాగోలా బ్రతికి బయటపడ్డ కిర్బీ పోలీసులను
ఆశ్రయించింది. జోనాథన్ కు 21నెలల జైలు శిక్ష విధించారు. 32 సంవత్సరాల జొనాథన్ తన గదికి
కిర్బీని తీసుకొని వెళ్ళాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కట్టెతో కొట్టడం
మొదలుపెట్టాడు. ఆరు గంటల పాటూ ఆమె శరీరం లోని ప్రతి ఒక్క భాగం మీద కూడా అతడు
కొట్టిన వాతలు ఉన్నాయి. అలాగే ఆమెను కొరికాడు కూడా..! కిర్బీ అతడి గదిలో కొద్ది
సేపు ఉంది.. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళతాను అన్నప్పుడు చిన్న గొడవ జరిగింది.
దీంతో అతడు ఆమెపై పడి చితక్కొట్టడం మొదలుపెట్టాడు. తనను కింద పడేసి తన్నడం, గొంతు బిగబట్టడం అన్నీ చేశాడు. చివరికి
ఆమెతో నువ్వు ఈ ఫ్లాట్ దాటి ఎలా వెళతావో అదీ చూస్తాను.. ఈరోజు నువ్వు నా చేతిలో
చస్తున్నావ్ అని అన్నాడని కిర్బీ తెలిపింది. ఆరు గంటల పాటూ చిత్ర హింసలు పెట్టిన
తర్వాత తాను కావాలని అనుకుంటే నిన్ను రేప్ చేసేవాడినని కానీ తాను అలాంటి వాడిని
కానని చెప్పాడట. కిర్బీ తాను ఉద్యోగానికి వెళ్ళాలి అంటే అప్పుడు జొనాథన్
వదిలేశాడట. ఆమె చెప్పులు కూడా వేసుకోకుండా నడుచుకుంటూ పోలీసులను ఆశ్రయించింది.
టీసైడ్ క్రౌన్ కోర్ట్ గ్రాహం, హార్ట్లేపూల్ కోర్టు అతడికి 21 నెలల శిక్షను విధించింది.









Comments
Post a Comment