మరో మెగా హీరోతో అనుఇమ్మాన్యుయేల్

మరో మెగా హీరోతో అను ఇమ్మాన్యుయేల్


టాలీవుడ్ లో మెగా ఫ్యామిలి హీరోలతో నటిస్తోన్న భామల సంఖ్య రాను రాను చాలా ఎక్కువైపోతోంది. అందులో ఎవరితో సినిమా చేసిన వరుసగా మరొక మెగా హీరోతో అవకాశాన్ని అందుకుంటున్నారు. ముఖ్యంగా తమన్నా - కాజల్ లాంటి హీరోయిన్స్ దాదాపు మెగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు సమంత కూడా ఆ లిస్ట్ లో చేరింది. అయితే వీరిలానే మరో ముద్దుగుమ్మ కూడా మెగా హీరోలతో జతకట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఆమె ఎవరో కాదు. రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమాతో పవన్ సరసన నటించిన అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా బేబీకి అవకాశాలు బాగానే అందుతున్నాయి. ఇక నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో మెగా హీరోతో కూడా అవకాశాన్ని అందుకునే అదృష్టానికి దగ్గరగా ఉందట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని తో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ ప్రాజెక్ట్ లో హీరోయిన్ పాత్రకు అను కరెక్ట్ గా సెట్ అవుతుందని అమ్మడికి ఛాన్స్ ఇవ్వాలని దర్శకుడు అనుకుంటున్నాడట. సాయి కూడా ఒకే చేశాడని తెలుస్తోంది. మొత్తానికి మూడవ మెగా ఛాన్సును బేబీ దక్కించేసుకుందని టాక్. ఇక ఈ సినిమాతో పాటు నెక్స్ట్ రాజమౌళి మల్టీస్టారర్ లో రామ్ చరణ్ కి జోడిగా అను పేరు వినబడుతోందని సమాచారం. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఆ విషయంపై ఒక క్లారిటీ రానుంది. 



Comments