రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు

రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు


దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు అందాయి. ఆయన తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ లఘుచిత్రం కాన్సెప్ట్‌ తనదని.. దాన్ని వర్మ కాపీ కొట్టారని పి.జయకుమార్‌ అనే రచయిత కోర్టులో పిటిషన్‌ వేశారు. 2015 ఏప్రిల్‌ 1న ఈ స్క్రిప్ట్‌ను తాను వర్మకు పంపానని కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని జయకుమార్‌ తెలిపారు. ఇటీవల విడుదలైన ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ట్రైలర్‌ చూసి షాకయ్యానని పేర్కొన్నారు.
తాను రాసిన స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే వర్మ ఈ లఘుచిత్రాన్ని యాథాతథంగా తెరకెక్కించారని ఆయన ఆరోపిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో వర్మకు నోటీసులు పంపినట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వర్మ ఈ లఘుచిత్రాన్ని విడుదల చేయనున్నారు.



Comments