రెండేళ్ళ క్రితం కనిపించకుండా పోయిన ప్రేమజంట.. ఇలా శవాలు బయటపడతాయని ఊహించి ఉండరు.

రెండేళ్ళ క్రితం కనిపించకుండా పోయిన ప్రేమజంట.. ఇలా శవాలు బయటపడతాయని ఊహించి ఉండరు.


రెండేళ్ళ క్రితం కనిపించకుండా పోయింది ఆ ప్రేమజంట.. ఎక్కడో హాయిగా బ్రతుకుతున్నారులే అని అందరూ అనుకున్నారు. కానీ వారిని కారుతో సహా పాతిపెట్టేశారని తాజాగా తెలిసింది. రోడ్డు వేయడం కోసం త్రవ్వకాలు మొదలుపెట్టడంతో కారు.. కారుతో పాటుగా అందులో రెండు శవాలు కూడా బయటపడ్డాయి. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.యమునానగర్ వద్ద నేషనల్ హైవే వేయడం కోసం త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇంతలో ఓ కారు బయటపడింది. ఆ కారులో ఉన్నది కోతర్ ఖానా గ్రామానికి చెందిన నరేష్, అంజూ శవాలు అయుంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ వేరే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకున్నారు. అయినప్పటికీ ప్రేమలో ఉన్నారు. 7 జూలై 2016 న 46 సంవత్సరాల నరేష్.. 38 సంవత్సరాల అంజూను తీసుకొని ఆ కారులోనే ఎక్కడికో వెళ్ళిపోయాడు. మొదట వారిద్దరి గురించి వెతికిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత వారి గురించి మరచిపోయారు. పోలీసుల వద్ద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. వారు ఎక్కడైనా వేరు కాపురం పెట్టి ఉంటారులే అని భావించిన కుటుంబ సభ్యులు వారు తిరిగి వస్తారని కూడా ఊహించలేదు.హెచ్ఆర్02 ఏఏ 5500 కారును జులై 7న నరేష్ తీసుకొని వచ్చాడు. అంజూను కారులో ఎక్కించుకున్న నరేష్ ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. అంజూ భర్త రెండేళ్ళ క్రితం చనిపోయాడు. ఆ తర్వాత నరేష్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని కుటుంబసభ్యులే చెబుతున్నారు. వారిని ఎవరు అలా పాతిపెట్టారో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.








Comments