కారులో మట్టి, రక్తం అవుతుందని ఇద్దరిని చావుబ్రతుకుల మధ్య వదిలేసి వెళ్ళిన పోలీసులు.

కారులో మట్టి, రక్తం అవుతుందని ఇద్దరిని చావుబ్రతుకుల మధ్య వదిలేసి వెళ్ళిన పోలీసులు.


ఒకరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండి కూడా స్పందించకుండా పోతే అంతకు మించిన నీచమైన పని ఏదీ ఉండదు. కాపాడే అవకాశం ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు కేవలం వారి కారులో సీట్లకు మట్టి, రక్తం అవుతుందనే కారణంతో యాక్సిడెంట్ అయిన ఇద్దరు టీనేజర్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా.. ముగ్గురు పోలీసులు చూస్తూనే ఉన్నారు కానీ వారిని కాపాడాలని అసలు అనుకోలేదు. వారి కారు సీట్లకు రక్తం అవుతుందన్న ఒకే ఒక్క కారణంతో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. అర్పిత్ ఖురానా, సన్నీ అనే ఇద్దరు యువకులు రక్తపుమడుగులో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న చాలా మంది పోలీసులను మీరే ఆ పిల్లలని తీసుకొని వెళ్ళండి.. వాళ్ళు కూడా మీ బిడ్డలే అని అడిగారు కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. కారు ఎవరి వద్దా లేదు.. మీ ఒక్కరి వద్ద మాత్రమే ఉంది అని అడుక్కున్నా కూడా పోలీసుల మనసు కరగలేదు. ఆ తర్వాత మరో వాహనంలో ఆ కుర్రాళ్ళని తీసుకుని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అయితే వారు అప్పటికే చనిపోయి ఉన్నారని వైద్యులు తేల్చారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.. అయితే పోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగి తెస్తామా చెప్పండి..!




Comments