అదో అందమైన అబద్ధం
‘ఈ కథ కొత్తది.. కథనం కొత్తది.. నా పాత్ర కొత్తది’ ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం. ఓ సినిమా మొదలవుతోందంటే చిత్రబృందం అంతా ఈ పాటే పాడుతుంటుంది. అయితే రకుల్‌ప్రీత్ సింగ్ మాత్రం ఇంకొంచెం ‘కొత్త’గా మాట్లాడుతోంది. ‘‘కొత్త పాత్రలు, కొత్త కథలు పుట్టడం చాలా కష్టం. చిత్రసీమలో ఎన్నో కథలొచ్చాయి. ఎంతోమంది నటీమణులు వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. వాటిని మించిన కొత్తదనం ఇంకెక్కడి నుంచి వస్తుంది? ‘ఇదో కొత్త పాత్ర’ అన్నామంటే అది అందమైన అబద్ధం అనుకోవాలంతే. అయితే అప్పుడప్పుడూ దర్శకులు, రచయితలూ విభిన్నంగా ఆలోచిస్తారు. నటులు తమదైన శైలిలో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రమే కొత్తదనం చూసే అవకాశం వస్తుంది. ఎంత రొటీన్ పాత్ర అయినా.. .అందులో ఏదో ఓ రూపంలో కొత్తగా కనిపించాలన్న తపన ఈతరం కథానాయికలకు ఎక్కువ అవుతోంది’’ అని చెప్పుకొచ్చింది రకుల్.
Comments
Post a Comment