వంటింట్లో ఉండాల్సిన ప్రెజర్ కుక్కర్ భూమి లోపల ఎందుకుందానుకోకండి! అది గనక పేలి ఉంటేనా?
వంటింట్లో ఉండాల్సిన ప్రెజర్ కుక్కర్ ఇలా భూమి లోపల ఉందేమిటి? దానికి గాని అంతిమ సంస్కారం చేశారా? అని అనుకోకండి. అది ప్రెజర్ కుక్కర్ బాంబు.ఒక్కసారి అది గనక పేలి ఉంటే.. దాని తీవ్రతే వేరుగా ఉండేది. అత్యంత శక్తిమంతమైన ప్రెజర్ కుక్కర్ బాంబు అది. దాని నిండా ఐఈడీ పదార్థాలే కూరి ఉన్నాయిఈ కుక్కర్ బాంబు జమ్మూకాశ్మీర్‌లో బయటపడింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్‌లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులు ఈ కుక్కర్ బాంబును పాతిపెట్టినట్టు సీఆర్పీఎఫ్ బలగాలు గుర్తించారు.కండిజాల్-టంగ్‌పోర గ్రామాల మధ్య పాంపోర్ రైల్వేస్టేషన్ సమీపంలో దీన్ని గుర్తించారు. దీన్ని గమనించిన వెంటనే బాంబు డిఫ్యూజ్ సిబ్బందిని రప్పించి.. నిర్వీర్యం చేశారు.దీనితో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రెజర్ కుక్కర్ బాంబు పేలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండేదని సీఆర్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు.
Comments
Post a Comment