హోమ్లీ డ్రెస్ లో ట్రెండీ హాట్ నెస్
బాలీవుడ్ హీరొయిన్ దిశా పటాని భలే గడసరి. ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ హాట్ హాట్ స్టిల్స్ ఇస్తున్న దిశా పటాని కాంప్లిమెంట్స్ తో పాటు ఇదేమి డ్రెస్సింగ్ అంటూ కామెంట్స్ కూడా అందుకుంటోంది. ఇవి చెవిన పడ్డాయి కాబోలు వెంటనే అలెర్ట్ అయిపోయి సాంప్రదాయ లుక్ లో కొత్తగా కనిపించే ప్రయత్నం చేసింది. సోఫిటెల్ హోటల్ లో జరిగిన వెడ్డింగ్ జంక్షన్ ఫాషన్ షో లో పాల్గొన్న దిశా పటాని ట్రెడిషనల్ గా అనిపించే డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసింది కాని తనదైన శైలిలో అందాలు ఆరబోయటంలో తన టాలెంట్ చూపించేసింది. క్లీవేజ్ వొంపులు ఎక్కడ ఎలా కనిపించాలో వాటిని సరిగ్గా కనిపించేలా డిజైన్ చేసిన డ్రెస్ తో తన ఫాన్స్ ను నిరుత్సాహపరచకుండా అందాల విందు వడ్డించేసింది. ఈ షోలో బాగా హై లైట్ అయిన మోడల్స్ లో దిశా పటానినే టాప్ లో ఉందట.
ప్రస్తుతం భాగీ 2 మూవీలో టైగర్ ష్రాఫ్ తో చేస్తున్న దిశా అతనితోనే పీకల్లోతు ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ లో విడుదల కానుంది. సౌత్ ఎంట్రీ ఘనంగా చేద్దామనుకుని వరుణ్ తేజ్ లోఫర్ తో తెలుగుకు పరిచయమైన దిశా పటాని ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఇక్కడ అట్టే అవకాశాలు దక్కలేదు. దీంతో మళ్ళి హింది వైపు వెళ్లిపోయింది. బాహుబలికి ధీటుగా తమిళ్ లో దర్శకుడు సి.సుందర్ తీయాలని కలలు కంటున్న సంఘమిత్ర సినిమా కోసం తన పేరే పరిశీలనలో ఉంది. కథ విని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందే సంఘమిత్ర తనకు పెద్ద బ్రేక్ అవుతుందని దిశా నమ్ముతోంది. కాని ఇది సెట్స్ కు వెళ్ళడానికి చాలా టైం పట్టేలా ఉంది. గతంలో శృతి హాసన్ చేయనన్న పాత్రే దిశాను వరించినట్టు తెలిసింది. యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. డ్రెస్ ఎలాంటిది అయినా సందర్భం ఏదైనా తన ఫాన్స్ ని మాత్రం నిరాశ పరచను అని దిశా పటాని చెప్పకనే చెబుతోంది.
Comments
Post a Comment