ముగిసిన కత్తి మహేష్ వివాదం.. రాజీ అయిపోయారు.. ఎలా అంటారా.

ముగిసిన కత్తి మహేష్ వివాదం.. రాజీ అయిపోయారు.. ఎలా అంటారా.


గత కొద్ది నెలలుగా సీరియల్ లాగా సాగిన కత్తి మహేష్ వివాదం ఎట్టకేలకు ముగిసింది. సినీ రచయిత కోన వెంకట్ చెప్పినట్లుగానే వివాదం సద్దుమణిగింది. ఇకపై పవన్ అభిమానులు దూషించరని కోన వెంకట్ అన్నారు. అలాగే గుడ్లదాడికి పాల్పడిన వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్న మహేశ్ కత్తికి సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు.కోన వెంకట్ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ‘‘వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు ముందుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నిన్ను ఎవరూ దూషించరు, నీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారు పవన్‌కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అంటూ ట్వీట్ చేశాడు.ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పవన్ అభిమానులు-మహేశ్ కత్తికి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో స్టూడియో నుంచి నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవన్‌ అభిమానులపై పెట్టిన కేసును కత్తి ఉపసంహరించుకున్నారు. అనంతరం పవన్ అభిమానులు, మహేశ్ కత్తి కలిసి ఫిలింనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లో మహేశ్ కత్తి కూడా వివాదం ముగిసిందని తెలిపారు.పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.



Comments