రామ్ గోపాల్ వర్మ భార్యా, కూతురు గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.? కూతురు పెళ్లి వేడుకలో ఏమైందంటే.?
రామ్ గోపాల్ వర్మ భార్యా, కూతురు గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.? కూతురు పెళ్లి వేడుకలో ఏమైందంటే.?
గాడ్ ,సెక్స్ ,ట్రూత్ (GST) అంటూ రాంగోపాల్ వర్మ తీసిన ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు…ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం అంటూ చెప్పుకొస్తున్న వర్మను మహిళాసంఘాలు దుమ్ముదులిపేస్తున్నాయి. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని… అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలివేసిందని వ్యాఖ్యలు చేసి సంచలనాత్మక విషయాన్ని చర్చకు పెట్టారు. రాంగోపాల్ వర్మ భార్య ఎవరు..? ఆమె ఎందుకు వదిలేసింది…?చాలా మంది రాంగోపాల్ వర్మకు పెళ్లి కాలేదని అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఆయన భార్య పేరు రత్న… వారివురి దాంపత్యానికి గుర్తుగా రేవతి అనే కూతురు కూడా ఉంది.సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన రత్నది వర్మకి పూర్తి భిన్నమైన మనస్తత్వం. రత్న భర్తనుండి విడిపోయినప్పటికీ రేవతిని పద్ధతిగా పెంచుకున్నారు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన రేవతి పెళ్లి కూడా చేసుకుంది.అయితే ఆ పెళ్లి వేడుకలో కూడా తల్లి కూతుర్లు వర్మని గెస్ట్ గానే ట్రీట్ చేశారు.వర్మ భార్య గురించి వార్తలు ఎప్పుడూ రాలేదు కానీ వర్మ కూతురు మాత్రం తండ్రినెప్పుడూ విభేదిస్తునే వస్తుంది.ఆ మధ్య ఏదో ట్వీట్ విషయంలో కూడా తండ్రిని విభేదించి ఆ ట్వీట్ డిలీట్ చేస్తావా లేదా అని బహిరంగంగానే వెల్లడించింది. వర్మ ప్రవర్తన తెలిసిన ఎవరైనా భార్యభర్తలు ఎందుకు విడిపోయుంటారో అని పెద్దగా కారణాలు వెతుక్కోనక్కర్లేదు..సమాజంలో కొంచెం డిఫరెంట్ ఉండే వర్మకి కుటుంబవాతావరణం పెద్దగా సూట్ కాదని తనే చాలా సార్లు చెప్పాడు…అయితే భార్య గురించి వర్మ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు .కానీ ఈ మధ్య ఓ సందర్భంలో వర్మ మాట్లాడుతూ తనకు మంచి భార్య దొరికింది కాని… తన భార్యకు మాత్రం మంచి భర్త దొరకలేదని వ్యాఖ్యానించాడు. ఈ ఒక్కమాటతోనే చెప్పొచ్చు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో.
Comments
Post a Comment