కేయూ పురుషుల హాకీ జట్టు ఎంపిక
అంతర్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల హాకీ పోటీల్లో పాల్గొనే కేయూ జట్టును సోమవారం కేయూ క్రీడామండలి కార్యదర్శి డాక్టర్ జి.పాణి ప్రకటించారు. జట్టు సభ్యులను ఆయన ఛాంబర్‌లో అభినందించారు. అనంతరం జట్టు వివరాలను వెల్లడించారు. ఈనెల 26వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు విశ్వవిద్యాలయంలో జరిగే పోటీల్లో కేయూ జట్టు ఆడుతుంది. కేయూ వ్యాయామ విద్యా కళాశాల వ్యాయామ సంచాలకులు ఎం.రవీందర్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని వివరించారు.
ఎం.నగేష్, పి.పరమేశ్వర్, హెచ్.గజానంద్, కె.నర్సింగరావు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదిలాబాద్), పి.ప్రవీణ్, ఇ.శ్రీనివాస్, మహ్మద్ రబ్బాని, బి.మోహన్ (వాగ్దేవీ వ్యాయామ విద్యా కళాశాల, బొల్లికుంట, వరంగల్), ఏ.అఖిల్ (కేఎల్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల పాల్వంచ, ఖమ్మం), మహ్మద్ షేహదబ్ (చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల, హన్మకొండ), మహ్మద్ ఇజాజ్ (భారతీ డిగ్రీ కళాశాల, వరంగల్), మహ్మద్ ఇర్ఫాన్ (ఇస్లామియా డిగ్రీ కళాశాల, వరంగల్), ఇ.గణేష్ (వివేకావర్థనీ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం), ఎం.వంశీ (సంఘమిత్ర డిగ్రీ కళాశాల, భూపాలపల్లి), ఎం.రామేశ్వర్ (గణపతి డిగ్రీ కళాశాల, పరకాల), జి.రాజు (శ్రీరామానుజం వ్యాయామ విద్యా కళాశాల, ఉనికిచర్ల, వరంగల్)లు జట్టులో ఉన్నారు. ఈ పోటీల్లో రాణించి బహుమతులను గెలుచుకోవాలని కోరారు.
Comments
Post a Comment