టీవీలో యాడ్ ను చూసి హైట్ పెరిగే మందులు తెప్పించుకొని వాడాడు.. అదే అతడి

టీవీలో యాడ్ ను చూసి హైట్ పెరిగే మందులు తెప్పించుకొని వాడాడు.. అదే అతడి.


టీవీలలో వేసే యాడ్స్ ను గుడ్డిగా నమ్మితే ఎంత ప్రమాదమో.. ఈ ఒక్క ఘటనే ఉదాహరణ. వాటిని నమ్మిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. హైట్ పెరగడానికి తమ ప్రోడక్ట్స్ వాడమని వచ్చిన యాడ్స్ ను చూసి నమ్మిన ఓ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన వనపర్తి పట్టణంలోని బస్వన్నగడ్డలో చోటుచేసుకుంది.ఖాజా నజీర్ అహ్మద్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నజీర్ చదువుకుంటూనే ఖాళీ టైంలో పని చేస్తుంటాడు. పొట్టిగా ఉన్నానన్న బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. అయితే అతడు టీవీల్లో వచ్చిన యాడ్స్ కు ఆకర్షితుడయ్యాడు. తమ ఉత్పత్తుల్ని వాడితే ఎత్తు పెరిగిపోతారంటూ చెప్పిన మాటల్ని నమ్మి.. నాలుగు నెలల క్రితం ఆన్ లైన్ లో మందులు తెప్పించుకున్నాడు.మూడు రోజులు వాడిన తర్వాత అహ్మద్ కు వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం తాత్కాలికంగా ఉపశమనం కలిగినా కొన్ని రోజులుగా అదే పరిస్థితి రావటంతో అదే ఆసుపత్రిలో చూపించటం మొదలు పెట్టారు. మందుల కారణంగా ఇన్ఫెక్షన్ తో పరిస్థితి విషమించింది.దీంతో అతన్ని మహబూబ్ నగర్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నజరీ మరణించాడు. ఎత్తు పెరగాలన్న ఆశతో టీవీలో వచ్చే ప్రకటనల్ని చూసి తన కొడుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని నజీర్ తల్లి కన్నీరు పెట్టుకుంది. అకారణంగా తప్పుడు ప్రకటనలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.





Comments