ఇద్దరు జేసీలకు ఐఏఎస్‌ హోదా

ఇద్దరు జేసీలకు ఐఏఎస్‌ హోదా


వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ జిల్లా సంయుక్త పాలనాధికారులకు కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయగా, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో వెలువరించింది. 2016 అక్టోబరు 11 నుంచి వీరు జేసీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఐఏఎస్‌ శిక్షణపై  వెళ్లనున్నారు. తర్వాత వీరికి పోస్టింగులు లభించనున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన హరిత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేట ఆర్డీవోగా, జనగామ ఆర్డీవోగా, హైదరాబాద్‌లో  సెర్ప్‌ సంచాలకురాలిగా, ఈఎస్‌డీ మీసేవ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డ్వామా పీడీగా పని చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన అమయ్‌కుమార్‌ ఇంతకుముందు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా పనిచేశారు. భద్రాచలం ఆర్డీవోగా, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

Comments