బల్లిని చూస్తే జడుసుకుంటాం..బాలయ్య హీరోయిన్ మాత్రం బుగ్గ మీద ఉంచుకుని ముద్దాడుతోంది!
గోడ మీద ఎక్కడో బల్లి కనిపిస్తే జడుసుకుంటాం. దూరంగా జరిగి వెళ్లిపోతాం. అది సహజం. ఈ టాప్ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం బల్లిని బుగ్గ మీద ఉంచుకుని ముద్దాడుతూ ఫొటోకు ఫోజిచ్చింది.ఆ నటి రాధికా ఆప్టే. మన నందమూరి నటసింహంతో రెండు, మూడు సినిమాల్లో నటించారామె. తాజాగా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తోన్న ప్యాడ్‌మ్యాన్‌లో లీడ్‌రోల్ చేస్తున్నారు.ఈ సందర్భంగా సెట్స్ మీద తీసుకున్న ఓ పిక్‌ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. `బిహైండ్ ద సీన్` అంటూ ఓ క్యాప్షన్ తగిలించి వదిలారు. సరే! ఆ బల్లి నిజమైనది కాదు. ప్లాస్టిక్‌దే. షూటింగ్ కోసం ఆ బల్లి బొమ్మను వినియోగించారట.
Comments
Post a Comment