ఆన్‌లైన్‌లో పురుగుల మందు ఆర్డర్ చేసి..తాగి ప్రేమజంట ఆత్మహత్య
తమ ప్రేమను పెద్దలు నిరాకరించారన్న ఆవేదనతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో కలకలం రేపింది. నర్సంపేటలోని ఓ ప్రైవేట్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న భరత్‌తో అదే గ్రామానికి చెందిన షేక్ నజ్మీన్‌కు కొద్దికాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నజ్మీన్ క్రమంగా భరత్‌తో ప్రేమలో పడింది. గత కొంతకాలం సాఫీగా సాగిన వీరి ప్రేమ వ్యవహరం ఇంట్లో తెలియడంతో ఇరు కుటుంబాలు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రేమికులిద్దరూ తమకు చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో పురుగుల మందు కొనుగోలు చేసి ఇద్దరూ తాగారు. కుటుంబసభ్యులు వీరిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఎంజీఎం శవగారానికి తరలించారు.
Comments
Post a Comment