అక్కడ వ్యభిచారిణులు ఎంత సంపాదిస్తారో తెలుసా.. వారి పనిగంటలు..?
వ్యభిచారం అన్నది అన్ని దేశాల్లోనూ చట్టవ్యతిరేకం కాదు.. కొందరు వ్యభిచారం చేస్తూనే తమ కుటుంబాన్ని చెక్కబెడుతూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో యుకే కూడా ఒకటి. యునైటెడ్ కింగ్డమ్ లో వ్యభిచారం చేయడం అన్నది.. ఓ ఉద్యోగం లాంటిదే..! అయితే వారి ఆదాయాల మీద ఇటీవలే ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేమిటంటే సగటున వ్యభిచారిణుల ఆదాయం దాదాపు 25లక్షలట.. ఒక్కొక్కరు 27,271 బ్రిటీష్ పౌండ్లు ప్రతి ఏడాది సంపాదిస్తూ ఉంటారు.వీరిలో 10శాతం మంది ఈజీగా 50,000 పౌండ్లు సంపాదిస్తారట.. మరికొందరు అయితే 20,000 పౌండ్లు కూడా సంపాదించడం కష్టమేనని తాజా నివేదికలో తేలింది. మిగతా వృత్తులతో పోల్చుకుంటే ఇందులో పనిచేసే గంటలు కూడా చాలా తక్కువే..! అక్కడ ఉన్న సెక్స్ వర్కర్లలో సగం కంటే తక్కువ మంది వారానికి 10 గంటల కంటే తక్కువగానే పనిచేస్తారట.ప్రతి ఉద్యోగానికి ఇంటర్నెట్ అన్నది ఎలా తోడ్పాటును అందిస్తుందో వాళ్లకు కూడా ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతోందట. యుకే సెక్స్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ అన్నది చాలా అవసరం అయిపోయింది. 2000 సంవత్సరం నుండి వీరంతా వెబ్సైట్ లలో ఎక్కువగా తమ పేరును ఎన్ రోల్ చేయించుకుంటున్నారు. యుకే లో పనిచేస్తున్న సెక్స్ వర్కర్లలో 72శాతం మంది సొంతంగా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారు.
Comments
Post a Comment