పెళ్లి కూతురు కాబోతున్న ఆమ్రపాలి

పెళ్లి కూతురు కాబోతున్న ఆమ్రపాలి 

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఆమ్రపాలి వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్పీగా పని చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 18న వీరి వివాహం పెద్దల సమక్షంలో జరగనుంది. ఈ నెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు తెలిసింది.  కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రూరల్‌ జిల్లాకు కూడా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాహ విషయంపై ఆమ్రపాలిని ‘ఈనాడు’ సంప్రదించగా ధ్రువీకరించారు.


Comments