ప్రాణాల మీదకు తెచ్చిన ‘సెల్ఫీ విత్ ట్రైన్’
రైల్వే ట్రాక్ వద్ద సెల్ఫీ తీసుకోబోయిన ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. భరత్‌నగర్‌లో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎంఎంటీఎస్ రైలు వస్తున్న సమయంలో స్వీయ చిత్రం తీసుకుంటూ శివ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. బాధితుడు లింగంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Comments
Post a Comment