అయ్యో..శ్రీదేవి అలా అయిపోయిందేంటి
అలనాటి నటి శ్రీదేవిని చూసి అభిమానులు, మీడియా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఆమె మూతి, మొహం ఉబ్బిపోయి ఎప్పుడూ చూడని విధంగా కన్పిస్తున్నారు. దాంతో ఆమె మరోసారి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల వసంత పంచమి సందర్భంగా దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు శ్రీదేవి కూడా హాజరయ్యారు.
అనురాగ్ ఇంటి ముందు కారు నుంచి దిగిన శ్రీదేవిని చూసి అక్కడి అభిమానులు అవాక్కయ్యారు. మూతి అలా ఎందుకు అయిపోయింది? అని మీడియా ప్రశ్నించినా ఆమె స్పందించలేదట. కొన్నేళ్ల క్రితం శ్రీదేవి తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తరువాత ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్ కూడా తల్లిలాగే ముక్కుకు సర్జరీ చేయించుకుంది.
శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమా సమయంలోనూ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీని గురించి ఆమె క్లారిటీ ఇస్తూ..‘అలాంటిదేమీ లేదు. నేను ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాను. పవర్ యోగా చేస్తాను. వారంలో నాలుగు రోజులు టెన్నిస్ ఆడతాను. వీటన్నిటి వల్లే శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి’ అని తెలిపారు.
2017లో శ్రీదేవి ‘మామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వి ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతోంది.
Comments
Post a Comment