దక్షిణాఫ్రికా రావాల్సిందిగా శార్దూల్‌కు పిలుపు

విసిగిస్తున్నాడని.. కొడుకును చంపిన తల్లి


పదే పదే విసిగిస్తున్నాడని కన్న కొడుకునే అతి దారుణంగా చంపేసిందో తల్లి. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కొడుకు కనబడట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలోని కొల్లాంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొల్లాంకు చెందిన ఓ మహిళ తన 14ఏళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేసింది. హత్యను దాచిపెట్టేందుకు మృతదేహానికి నిప్పంటించింది. సగం కాలిపోయిన మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టింది. ఆ తర్వాత ఏం తెలియనట్లు తమ కొడుకు కనబడట్లేదని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కొడుకు ఎప్పటి నుంచి కనబడట్లేదని పోలీసులు అడగ్గా.. సదరు మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మహిళ ఇంటి చుట్టూ తనిఖీ చేయగా.. బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పుడు మరోసారి ఆ మహిళను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అది కావాలి, ఇది కావాలి అని పదేపదే విసిగిస్తుండటంతో ఆవేశంలో తానే హత్య చేసినట్లు సదరు మహిళ ఒప్పుకుంది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి వెనుకకు తీసుకెళ్లి కాల్చేసి పాతిపెట్టినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కాగా.. గత కొంతకాలంగా తన భార్య మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. అందుకే ఇలా ప్రవర్తించిందని ఆమె భర్త చెబుతున్నాడు.


Comments