ఓ బైక్ ను చూసి భలే ఉందే అన్న పవన్ కళ్యాణ్.. ఇంతకూ ఆ బైక్ స్పెషాలిటీ ఏంటంటే.

ఓ బైక్ ను చూసి భలే ఉందే అన్న పవన్ కళ్యాణ్.. ఇంతకూ ఆ బైక్ స్పెషాలిటీ ఏంటంటే.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కరీంనగర్ వెళ్ళారు.అయితే అక్కడ ఆయనను ఒక బైక్ ఆకర్షించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. జనసేన చిహ్నాలతో ఆ బైకుని అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చారు. ఆ బైకును అభిమానులు పవన్ కి చూపించారు. దీన్ని చూసిన పవన్ కళ్యాణ్ బైక్ భలే ఉందే అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో తమ పార్టీ తెలంగాణ, ఆంధ్ర ప్ర‌దేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని అన్నారు. ఇరు రాష్ట్రాల్లో త‌మ‌కు బలం ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని వివ‌రించారు. తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనే విష‌యం ఎన్నిక‌లకు రెండు నెల‌ల ముందు అంద‌రికీ తెలుస్తుందని అన్నారు. ఇందు కోసం తాము సీనియర్ జర్నలిస్టులు, మేధావుల సలహాలు కూడా తీసుకుంటామ‌ని చెప్పారు.







Comments