వనదేవత ఆలయంలో చరణ్ కొత్త చిత్రం
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 12వ చిత్రం ప్రారంభమైంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని వనదేవత ఆలయంలో సినిమాను ప్రారంభించారు. ఇందులో చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేస్తూ..‘ఆల్ ది బెస్ట్ మిస్టర్ సి. బిగ్ డే టుడే. న్యూ బిగినింగ్స్’ అని పేర్కొన్నారు. మరోపక్క చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్ త్వరలో పూర్తికానుంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘ఎం.ఎస్ ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కైరా అడ్వాణీ. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో కైరా మహేశ్ బాబుకు జోడీగా నటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
Comments
Post a Comment