లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో మరమ్మతు చేస్తుండగా..కింగ్‌సైజ్ సిగరెట్ ప్యాకెట్లు: ఇప్పటివి కావు!
లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో మరమ్మతు చేస్తుండగా..కింగ్‌సైజ్ సిగరెట్ ప్యాకెట్లు: ఇప్పటివి కావు!
బకింగ్‌హామ్ ప్యాలెస్. చిన్నప్పటి నుంచీ వింటూ వస్తోన్న పేరు. దీని గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం కూడా. లండన్ వెస్ట్‌మినిస్టర్ ప్రాంతంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను 1820లో కట్టారు.రాజ వంశస్థులు అందులో నివసిస్తున్నారు. వందేళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రెండు రోజుల కిందట మరమ్మతులు చేపట్టారు.పగిలిపోయిన ఫ్లోర్ పలకలను తొలగించి కొత్తవి వేయడం, వైరింగ్ లోపాలను సరిచేయడం, ఎక్కడైనా తెగిన విద్యుత్ తీగలు ఉంటే.. వాటిని తీసివేయడం వంటి పనులన్నమాట.
ఇలాంటి చిన్నచిన్న మరమ్మతు పనులు అనేవి ప్రతి ఆరునెలలకోసారి జరుగుతుంటాయి. మరమ్మతు పనులు చేస్తుండగా.. ఫ్లోర్ అడుగు భాగంలో అక్కడి సిబ్బందికి దొరికిన కొన్ని వస్తువులు ఆశ్చర్యాన్ని కలిగించాయి.అవి కొన్న ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, రెండు పేపర్ కటింగ్‌లు, ఈ పేపర్ కటింగ్ ఉన్న తేదీని నివ్వెరపోయారు సిబ్బంది. ఎందుకంటే.. 1889 సంవత్సానికి సంబంధించిన పేపర్ కటింగ్ అది. ఆ దినపత్రిక పేరు `ఈవెనింగ్ స్టాండర్డ్..`.






Comments
Post a Comment