హైదరాబాద్ లో థియేటర్లను తగులబెడతానన్న రాజా సింగ్ సినిమా చూశాక ఏమన్నారో తెలుసా..?
ఏదైనా కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడితేనే అభాసుపాలుకాకుండా ఉంటారు. పద్మావత్ సినిమాను చూడకుండానే చాలా వివాదాలు సృష్టించారు. ఏవేవో ఊహించుకొని సినిమా విడుదల ఆపడానికి ప్రయత్నించారు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు సరికదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తోంది. ఆ కోవలోకి చెందిన వారే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్..!ఈయన పద్మావత్ సినిమా విడుదలకు ముందు సినిమాను ఆడించే థియేటర్లను తగులబెడతామని హెచ్చరించారు. తన నియోజకవర్గం పరిధి లోని థియేటర్ల యజమానులను మేనేజర్లను హెచ్చరించారు కూడానూ.. అయితే సినిమా చూశాక కానీ తెలీలేదు. ఆయన అన్న మాటలు అనవసరమైనవని.ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘పద్మావత్’ సినిమాను చూసిన రాజాసింగ్ గతంలో తాను చేసిన మాటలను ఉపసంహరించుకున్నారు. సినిమాలో రాజ్ పుత్ లకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవని, సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ‘కొంచెం ఓపిక పట్టాలి. చాలా సంఘాలు ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆయా సంఘాలకు చెందిన ఒక్కో అధికారి ఈ సినిమాను చూడాలి. అలా చూస్తేనే వాళ్లకు ఈ సినిమాలో ఏముందో తెలుస్తుంది. అందులో తప్పుందో లేదో తెలుసుకోవాలి. సినిమా చూశాక తప్పుంటే అప్పుడు కార్యకర్తలకు చెప్పాలి’ అని రాజాసింగ్ అన్నారు. ఇదేదో ముందే సినిమా చూశాక మాట్లాడుదాం అని ఆయన అనుకొని ఉండి ఉంటే ఇంత వివాదం అయ్యేది కాదు కదా..!
Comments
Post a Comment