సూపర్‌స్టార్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో హీరోగా తన సత్తా చాటిన నటుడు విజయ్ దేవరకొండ. ఈ రెండు చిత్రాలు యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చి పెట్టాయి. ఇటీవల విజయ్ బెంగళూరు వెళ్లారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన ఇంటిలో కలిశారు. ఈ సందర్భంగా పునీత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరు స్టార్స్ ఒకే రంగు దుస్తుల్లో చాలా సంతోషంగా ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పునీత్ అన్నతో సరదాగా గడిపానంటూ విజయ్ ట్వీట్ చేశారు.ఇదే ఫొటోను పునీత్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండను ఇంటిలో కలిశానని, ఈ వారం గొప్పగా ప్రారంభమైందని అన్నారు. విజయ్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరుశురాం దర్శకుడు. కన్నడ నటి రష్మికా మండన్న కథానాయిక. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో ‘మహానటి’ రూపుదిద్దుకుంటోంది.విజయ్ తమిళంలోనూ అరంగేట్రం చేస్తున్నారు. ఆయన హీరోగా స్టూడియో గ్రీన్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది.
Comments
Post a Comment