డ్రగ్స్ ఈ యువతిని ఎంతకు తెగించేలా చేశాయంటే.. డ్రగ్స్ ను అక్కడ దాచి తరలించేది.
డ్రగ్స్ అనేవి మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. ఈ యువతి కూడా అలాంటిదే. డ్రగ్స్ మాయలో పడి చివరికి జైలులో మగ్గనుంది. డ్రగ్స్ ను తరలించడానికి చివరికి తన బ్రా, అండర్ వేర్ లను కూడా వాడేదట.27 సంవత్సరాల సిడ్నీ అమ్మాయి అమండా అర్బిబ్ ను గతంలోనే ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నువ్వు ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళద్దని హెచ్చరించి వదిలేశారు. కానీ అమండా వారి హెచ్చరికలను బేఖాతరు చేసింది. ఏకంగా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడింది.ఎక్కువగా పార్టీలను ఇష్టపడే అమండా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడింది. గత ఏడాది జూన్ లో పోలీసులు ఈమె మీద అనుమానం వచ్చి పట్టుకున్నారు. తనను కొందరు ఇందులో ఇరికించారని.. తనకు ఎవరో డ్రగ్స్ కలిపి ఇచ్చారని చెప్పి కట్టుకథలు చెప్పింది. అలాగే తన లాగా ఎవరూ అవ్వకూడదని కూడా కోరింది. ఆమెకు కోర్టు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి పంపించివేసింది.తాజాగా ఆమెనే డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయిపోయింది. చాలా ఏళ్లుగా డ్రగ్స్ తరలిస్తూ బాగా డబ్బు సంపాదించిందట అమండా.. లక్షల విలువ చేసే హ్యాండ్ బ్యాగులు, పార్టీలు బాగా ఎంజాయ్ చేసింది. చివరికి ఆమెకు డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉందని తెలిసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెను పట్టుకున్నప్పుడు కూడా ఆమె దగ్గర డ్రగ్స్ లభించాయి. శుక్రవారం నాడు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. జనవరి 23న ఆమె మరోసారి కోర్టు ఎదుట హాజరుకానుంది.
Comments
Post a Comment