లాకప్‌లో కోడిపుంజులు కోర్టు వాయిదాతో స్టేషన్‌కు చేరిన కోళ్లు

లాకప్‌లో కోడిపుంజులు  కోర్టు వాయిదాతో స్టేషన్‌కు చేరిన కోళ్లు 

నేరస్థులు తప్పించుకోకుండా లాకప్‌లలో పెడుతుంటారు. అదే లాకప్‌లో పోలీసులకు కోడిపుంజులను ఉంచాల్సిన పరిస్థితి ఎదురైంది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఈమధ్య కాలంలో జరిగిన కోడిపందేలపై స్థానిక పోలీసులు వరసగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది పుంజులతోపాటు ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. నిందితులను వ్యక్తిగత పూచీపై విడిచిపెట్టారు. తరువాత పుంజులను, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. మిగిలిన ప్రాంతాల్లో పట్టుకున్న కోడిపుంజులతో సహా అన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలన్న కోర్టు ఆదేశాల మేరకు వీటిని తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ఎస్సై దీనబంధు తెలిపారు. దీంతో అచ్యుతాపురం పోలీసుస్టేషన్‌ పుంజులతో కళకళలాడుతుంది.



Comments