ఫారెస్ట్ ఆఫీసర్..ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో..మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా
కర్నూలు జిల్లాలో డివిజనల్ అటవీ అధికారి ఆయన. పేరు వెంకటేశ్వరరావు. తన హోదా, స్థాయి మరిచి అటవీశాఖ గెస్ట్‌హౌస్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. రాసలీలు సాగించారు.ప్రతి శని, ఆదివారాల్లో ఆయన పని ఇదేనట. అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌ను ఓ బ్రోతల్ హౌస్‌గా మార్చివేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన విద్యార్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనితో ఆయనపై నిఘా వేసిన పోలీసులు.. ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్న పరిస్థితుల్లో ఓ మహిళతో అటవీశాఖ గెస్ట్‌హౌస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం రేపింది.సోమవారం అర్థరాత్రి గెస్ట్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేసి వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ వివరాలను వెల్లడించలేదు. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులు వెంకటేశ్వర రావును సస్పెండ్ చేశారు.
Comments
Post a Comment