ఫిబ్రవరిలో మొదలవుతుంది: సమంత
2018లో సమంత కొత్త చిత్రం మొదలుకాబోతోంది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘యూ టర్న్’ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటించనున్నారు. ఈ విషయాన్ని సమంత ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుకాబోతున్నట్లు తెలిపారు. ‘2018 ఎవ్రీథింగ్ ఐ వాంట్. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుకాబోతోంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. మరోపక్క సమంత ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో సమంత నటించిన ‘అభిమన్యుడు’ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఇందులో సమంత విశాల్‌కు జోడీగా నటించారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘రంగస్థలం’ టీజర్ ఈరోజు విడుదల చేయనున్నారు.
Comments
Post a Comment