మద్యంతో స్నానం చేసే పాకిస్థానీ భార్య.. ఆమె కోసం నిరంతరం 22 మంది పనివాళ్ళు.
పాకిస్థాన్ మూలాలు కలిగిన బ్రిటీష్ కోటీశ్వరుడు మొహమ్మద్ జహూర్ ను ఉక్రెయిన్ కు చెందిన సింగర్, మోడల్, నటి నతల్యా షమ్రెన్కోవా 2003లో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె స్నానం చేసే తీరుపై అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అదేమిటంటే ఆమె స్నానం చేయడానికి మద్యం తెగ వాడేస్తుందట. పెళ్ళి అయ్యాక కమాలియాగా పేరు మార్చుకున్న ఈమె షాంపేన్ ద్వారా తాను స్నానం చేస్తానని చెప్పి వార్తల్లో నిలిచింది.షాంపేన్ లో స్నానం చేసే కమాలియాఖర్చు గురించి లెక్క చేయదు. ఆమె ఏడాదికి వినియోగించే మద్యానికి 1.94 కోట్లు ఖర్చవుతాయట..! ఆమె స్నానం కూడా షాంపేన్ తోనే చేస్తుందంటే వినడానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవమేనని తెలుస్తోంది. ఆమె స్నానానికి మద్యం సిద్ధం చేసేందుకు మొత్తం 22 మంది పనిచేయడం విశేషం. కేవలం అందం కోసమే ఆమె ఈ పని చేయడం విశేషం. అయినా ఆమెను అడ్డుకునేది ఎవరు చెప్పండి. భర్త పెద్ద కోటీశ్వరుడు.ఇక ఆమె ధరించే వస్తువులు కూడా లక్షలు విలువ చేసేవే..! ఆమె ధరించే వాచ్ ధర 40 లక్షల రూపాయలు.. ఇక అద్దాలు ఒక్కొక్కటి నాలుగు లక్షల రూపాయలు. హ్యాండ్ బ్యాగ్ ధర 90 లక్షల రూపాయలు.. ప్రతి ఏడాది చెప్పుల కోసమే ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుందంటే ఇక ఏ రేంజి కోటీశ్వరులో అర్థం చేసుకోవచ్చు. అలాగే వారి వద్ద వేరే వేరే దేశాల్లో ఏకంగా 14 ఇళ్ళు.. రెండు ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి.
Comments
Post a Comment