2018లో చోటుచేసుకున్న మొదటి దాడి

2018లో చోటుచేసుకున్న మొదటి దాడి

 అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక కెంటకీ హై స్కూల్‌లోకి ఓ ఆగంతకుడు చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే నిందితుడు పారిపోవడానికి యత్నించాడు. అయితే అప్పటికే పోలీసులు పాఠశాల మొత్తం చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2018లో అగ్రరాజ్యంలో జరిగిన తొలి దాడి ఇదేనని పోలీసులు తెలిపారు.కాల్పుల ధాటికి కొందరు విద్యార్థులు దగ్గర్లోని పొలాల్లోకి పరుగులు తీయగా.. మరికొందరు వాహనాల్లో దాక్కున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు అమెరికా పాఠశాలల్లో 283 దాడులు జరిగాయని ఓ నివేదికలో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు.


Comments