ఏకంగా ఎమ్మెల్యేను బెదిరించి 2కోట్లు నొక్కేయాలని భావించిన 21 సంవత్సరాల యువతి..
ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది ఓ యువతి. రెండు కోట్ల రూపాయలు ఇవ్వలేదంటే.. తనపై అత్యాచారం చేశాడనే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో ఎమ్మల్యే పోలీసులను ఆశ్రయించారు. ఆయన 5 లక్షల రూపాయలు ఆ యువతికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు.జర్నలిజం చదివే ఓ విద్యార్థిని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన హేమంత్ కటారేకు పలు మెసేజీలు పంపింది. నువ్వు అత్యాచారం చేశావని వీడియో బయటపెడతానంటూ అతన్ని బెదిరించింది. రెండు కోట్ల రూపాయలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమని చెప్పింది. 21 సంవత్సరాల యువతి జనవరి 17 నుండి హేమంత్ కు పలుమార్లు కాల్ చేయడం.. మెసేజీలు చేయడం చేసింది. 19వ తేదీన ఆయన పోలీసులను ఆశ్రయించారు. నువ్వు నన్ను రేప్ చేశావని అలాగే తాను సూసైడ్ కు ప్రయత్నించినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నీ పరువంతా పోతుందని బెదిరించింది.
హేమంత్ ఆమెను గత ఏడు నెలల్లో రెండు సార్లు పబ్లిక్ ఈవెంట్లలో కలిశాడట. తన ఫోన్ నంబర్ సంపాదించిన ఆమె చాలా ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయమని చెప్పింది. కానీ అందుకు హేమంత్ తిరస్కరించాడు. దీంతో ఎలాగైనా డబ్బులు రాబట్టాలని ప్రయత్నించింది. అందుకే అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. తీరా 5 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. భోపాల్ లోని రచనా నగర్ లో ఆమెను అరెస్ట్ చేశారు.
Comments
Post a Comment