రాత్రి 11 తర్వాతే శృంగారంలో పాల్గొంటారా.? పగలు కూడా చేస్తుంటారు.! అని హీరోయిన్స్ ఫైర్.! అసలేమైంది?
కండోమ్ ప్రకటనలను ఇకపై రాత్రి పూట 11 గంటల తరువాత మాత్రమే టీవీల్లో ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పగటి పూట, ప్రైమ్ టైమ్‌లలో ఇలాంటి యాడ్స్‌ను ప్రదర్శిస్తే ఆ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలసి టీవీ చూడడం ఇబ్బందిగా ఉంటుందనే నేపథ్యంలోనే ఇలాంటి ఆదేశాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కానీ దీనిపై చాలా మంది తమ విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా పలువురు నటీమణులు ఈ విషయంపై బహిరంగ చర్చలోనే తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు, వారు ఏం చెప్పారో తెలుసా..?ఒకప్పటి నటీమణులు గౌతమి, ఖుష్బూలతోపాటు నేటి తరం తారలు తాప్సీ, కాజల్ అగర్వాల్‌లు ఇండియా టుడే నిర్వహించిన ఓ సదస్సుకు హాజరై అందులో అడిగిన ప్రశ్నలకు దీటుగా జవాబులు చెప్పారు. అయితే ఆ ప్రశ్నల్లో పైన చెప్పిన కండోమ్ యాడ్ కూడా ఉంది. సదరు నిషేధం పట్ల మీ అభిప్రాయం ఏమిటని ఆ నలుగురు నటీమణులను అడగ్గా వారు ఇలా స్పందించారు. రాత్రి 11 గంటల తరువాతే కండోమ్ యాడ్స్‌ను ప్రసారం చేసే విషయంపై అభిప్రాయం అడగ్గా అందుకు నటి గౌతమి మాట్లాడుతూ… కండోమ్ అనేది సురక్షితమైన శృంగారానికే కాదు, జనాభా నియంత్రణకు కూడా పనికొస్తుందని చెప్పింది. అయితే కండోమ్ యాడ్‌లను ప్రైమ్ టైమ్‌లో వేస్తే దాని ఉద్దేశం జనాలకు ఇంకా ఎక్కువగా చేరుతుందని తెలియజేసింది.
Comments
Post a Comment