యాచకుల సమాచారం ఇస్తే రూ. 1000..!
నగరంలోని యాచకుల సమాచారమందించే వారికి ఇచ్చే నగదు పురస్కారాన్ని జైళ్ల శాఖ రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు జైళ్ల శాఖ కార్యాలయానికి యాచకుల సమాచారం అందించిన వారికి రూ.500 నగదు పురస్కారం అందించేవారు. దానిని రూ.1000కి పెంచుతూ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆదేశాలు ఇచ్చారు. నగరంలో భిక్షాటన చేసేవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, జైళ్ల సిబ్బంది వచ్చే వరకు సదరు ఫిర్యాదుదారు అక్కడే ఉండాలని కోరారు. అలా ఉంటేనే రూ.1000 నగదు పురస్కారం అందుతుందని స్పష్టం చేశారు. అలా కాకుండా కేవలం ఫిర్యాదు చేస్తే నగదు ఇవ్వడం కుదరదని ఆయన వివరించారు. యాచక రహిత నగరంగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాచకుల సమాచారం తెలియజేయాల్సినవారు 040 24511791 లేదా 040 24527846 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Comments
Post a Comment