రిసెప్షన్ లో “అనుష్క శర్మ” కట్టుకున్న చీర నాదంటే నాది అని గొడవ…అసలేమైందో తెలుసా..

రిసెప్షన్ లో అనుష్క శర్మకట్టుకున్న చీర నాదంటే నాది అని గొడవఅసలేమైందో తెలుసా..?


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌లు వివాహం చేసుకోవ‌డం ఏమో గానీ అందుకు సంబంధించిన వార్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. వారిద్ద‌రూ ప్రేమించుకోవ‌డం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి పెళ్లి చేసుకునే వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు అన్నీ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వారి పెళ్లి అయిపోయింది, రిసెప్ష‌న్ ముగిసింది. అయినా ఇప్పుడు వీరికి చెందిన ఇంకో వార్త వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. అనుష్క శ‌ర్మ రిసెప్ష‌న్ చీర గురించే. ఆమె క‌ట్టుకున్న చీరపై ఇప్పుడు వివాదాలు వ‌స్తున్నాయి. డిసెంబ‌ర్ 21న ఢిల్లీలో కోహ్లీ-అనుష్క వివాహ రిసెప్షన్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే రిసెప్ష‌న్ సంద‌ర్భంగా అనుష్క శర్మ ఎరుపు రంగు బెనార‌స్ చీర ధ‌రించింది. ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా కూడా నిలిచింది. అయితే ఆ చీరే ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. కాగా స‌ద‌రు చీర‌ను సబ్యచాచి డిజైనర్ ముఖర్జీ అతని సిగ్నేచర్ డిజైన్ గా పేర్కొంటూ ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశారు. అయితే లక్నోకి చెందిన నేహా శ్రీవాత్సవ అనే మహిళ సబ్యచాచి ముఖర్జీ ఫేస్ బుక్ పోస్ట్ పై స్పందిస్తూ.. చీరను నేసిన వాళ్లకి క్రెడిట్ ఇవ్వకుండా తాను ఒక్కడే ఆ చీర డిజైన్ క్రెడిట్ తీసుకుంటున్నాడని ఆరోపించింది. నేహా ఇంకా మాట్లాడుతూ.. నేతన్నలు నేసిన చీరను వాళ్ల బ్రాండ్ కోసం 5 నుంచి 10 రెట్ల.. రేట్లు పెంచి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇది లిమిట్స్ క్రాస్ చేయటమేనని ఆమె ఆరోపించారు. త్వరలోనే ఈ చీర కాపీలు మార్కెట్ లోకి వ‌స్తాయ‌ని తెలిపారు. 2017 అక్టోబరులో తాను అలాంటి చీరనే ఢిల్లీలో కొనుగోలు చేశానని తెలిపారు. నేతన్నలు కష్టపడి చీరపైలపై డిజైన్లు, వివిధరకాల పేట్రన్లు చేస్తుంటే డిజైనర్లు మాత్రం ఆ క్రెడిట్ ను వాళ్లకు దక్కకుండా చేస్తున్నారని శ్రీవాస్తవ విరుచుకుపడింది. మ‌రి చివ‌ర‌కు ఈ వివాదం ఏమ‌వుతుందో చూడాలి. ఏది ఏమైనా కార్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే కాదు వ్య‌క్తులు కూడా అంతే క‌దా. ఎవ‌రో చేసిన ప‌నిని తామే చేశామ‌ని చెప్పి క్రెడిట్ కొట్టేస్తారు..!




Comments