అను'వణువూ గ్లామర్ దంచేస్తోంది

అను'వణువూ గ్లామర్ దంచేస్తోంది


టాలీవుడ్ లో నెక్ట్స్ జెన్ స్టార్ హీరోయిన్ అనే అంచనాలు ఉన్న భామల జాబితాలో అను ఇమాన్యుయేల్ పేరు టాప్ లోనే ఉంటుంది. అతి తక్కువ సినిమాలే చేసినా.. పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ పట్టేసి.. స్టార్ హీరోయిన్ రూట్ లోకి వెళ్లిపోయింది అను ఇమాన్యుయేల్. ఈమె ఇప్పటివరకూ తెలుగులో నటించిన సినిమాల్లో బోలెడంత పద్ధతిగా కనిపించేసింది.

వాస్తవానికి ఈ అమెరికా కుట్టి రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇది కాదని అంటారు సినీ జనాలు. చికాగోలో పుట్టి.. డల్లాస్ లో పెరిగిన అను ఇమాన్యుయేల్.. అల్ట్రా మోడర్న్ బ్యూటీనే. కాకపోతే మజ్ను పుణ్యమా అని మనోళ్లు అలాంటి క్యారెక్టర్లనే ఇస్తున్నారంతే. ఇప్పుడు పవన్ మూవీ అజ్ఞాతవాసిలో కూడా అను ఇలానే కనపడనుందనే టాక్ ఉంది. అయితే.. ఈమె ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండగలదో.. రీసెంట్ గా ఓ లుక్ చూపించింది. ఓ ఈవెంట్ కోసం హాజరైన అను ఇమాన్యుయేల్.. ఏ మాత్రం సంశయాలకు పోకుండా.. క్లీవేజ్ కనిపించేలా స్లీవ్ లెస్ టాప్ ధరించేసింది.

అణువణువూ సౌందర్యం నిండిన ఈమె రూపాన్ని.. ఇలా లైవ్ లో చూడడం అక్కడున్న జనాలకు ఇదే తొలిసారి కావడంతో.. అందరూ షాక్ తినేశారు. పోస్టర్స్ లోనే ఇంత గ్లామర్ గా కనిపిస్తూ మెరుపులు మెరిపిస్తుంటే.. లైవ్ లో చూసిన చూపరుల పరిస్థితిని పాపం అర్ధం చేసుకోవాలి కదా. మొత్తానికి గ్లామర్ షో విషయంలో అను ఇమాన్యుయేల్ తన అసలు సత్తా ఏంటో చూపించేందు.. మెల్లమెల్లగా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసిందని ఫిక్స్ అయిపోవచ్చేమో కదా!







Comments