ఎయిర్‌పోర్టులో పాట‌పాడిన ఎయిర్‌లైన్స్ మ‌హిళా ఉద్యోగిని… త‌రువాత ఏమైందో తెలుసా.

ఎయిర్‌పోర్టులో పాట‌పాడిన ఎయిర్‌లైన్స్ మ‌హిళా ఉద్యోగినిత‌రువాత ఏమైందో తెలుసా.


ప్ర‌యాణాలంటేనే బోర్‌అందులోనూ సుదీర్ఘ స‌మ‌యం పాటు ప్ర‌యాణం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. బ‌స్సు, రైలు, విమానం.. ఇలా ఏ మాధ్య‌మంలో అయినా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప్ర‌యాణిస్తే ఎవ‌రికైనా స‌హ‌జంగా బోర్ కొడుతుంది. అలాంట‌ప్పుడు టైం పాస్ కోసం ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ని చేస్తారు. కొంద‌రు బుక్స్ చ‌దువుతారు, కొంద‌రు పాట‌లు వింటారు. అయితే ఇలా ఆలోచించిందో ఏమో గానీ ఆ దేశంలో ఓ విమానాశ్రయంలో ప‌నిచేస్తున్న ఓ ఎయిర్‌లైన్స్ లేడీ స్టాఫ్ ఒకామె ప్ర‌యాణికుల బ‌డ‌లిక తీర్చేందుకు వారిలో ఉత్సాహం నింపేందుకు ఓ ప‌ని చేసింది. అదేమిటంటే అది మెల్ బోర్న్ ఎయిర్ పోర్టు. గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌యాణం చేసిన ప్ర‌యాణికులు, ప్ర‌యాణం చేయ‌డానికి వ‌చ్చే వారు, వారిని దిగ‌బెట్ట‌డానికి వ‌చ్చే వారితో బిజీగా ఉంది. ఇంత‌లో మైక్ అనౌన్స్‌మెంట్‌లో ఓ పాట వినిపించింది. అందరూ మొద‌ట షాక్ అయ్యారు. అయితే చివ‌ర‌కు ఆ పాట పాడింది ఓ మ‌హిళా సిబ్బంది అని తెలిసి యాక్టివ్‌గా, షాకింగ్‌గా ఫీల‌య్యారు. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో వర్జిన్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగిని ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో క్రిస్మస్ పాట పాడి అందరినీ విస్మయానికి గురి చేసింది. కాగా ఆమె పాట పాడుతున్న‌ప్పుడు తీసిన వీడియోను వర్జిన్ ఆస్ట్రేలియా తన ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది. అంతే కాదు.. వర్జిన్ గ్రూప్ అధినేత రిచార్డ్ బ్రాన్సన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆ వీడియోను షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియోలో ఆమె పాట హాట్ టాపిక్ అయ్యింది. ఆమె పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కావాలంటే మీరు దాన్ని చూడ‌వ‌చ్చు..!

Comments