వేషాల కోసం పడకగదికి.. నాకు తప్పలేదు.. హీరోలు బాధితులే.. ప్రియాంక చోప్రా


వేషాల కోసం పడకగదికి.. నాకు తప్పలేదు.. హీరోలు బాధితులే.. ప్రియాంక చోప్రా

వేషాల కోసం పడకగది (క్యాస్టింగ్ కౌచ్)కి రమ్మనే దుష్ట సంస్కృతిపై ఒక్కొక్కరే పెదవి విప్పుతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టెన్ ఉదంతం బయట ప్రపంచానికి వెలుగు చూసిన తర్వాత ఈ తరహా కథనాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా షాకింగ్ విషయాలను వెల్లడించడంతో సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పెంగ్విన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. తనకు లైంగిక, బంధుప్రీతి వేధింపులు తప్పలేదు అని చెప్పింది.వేషాల కోసం నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు చాలా భయమేసేది. పరిస్థితి అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని నా సహచరులు కూడా భయపెట్టేవారు. నిర్మాతల గదిలోకి బిక్కు బిక్కు మంటూ వెళ్లేదానిని. నా సినీ కెరీర్ ఆరంభంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది.ఓ సందర్భంలో నాకు ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. కానీ నన్ను ఆ సినిమా నుంచి తప్పించి తన గర్ల్‌ఫ్రెండ్ సిఫారసు చేసిన ఓ హీరోయిన్‌ను తీసుకొన్నారు. ఇదోరకమైన వేధింపులు సినీ పరిశ్రమలో ఎక్కువగానే ఉంటాయి. దర్శకులు చెప్పారని, నిర్మాత బంధువులు సూచించారన్న కారణంతో నన్ను చాలా సార్లు సినిమాల నుంచి తప్పించారు.అప్పట్లో అలాంటి పరిస్థితులను ఎదురించే శక్తి లేకపోయింది. చివరి నిమిషంలో తప్పించినన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అధికారం, డబ్బు బలం ఉన్న వ్యక్తులతో నాకు పోరాడే శక్తి లేకపోయింది. అలాంటి వారి గొంతెమ్మ కోరికలను లెక్క చేయకపోయేదానిని.సినీ పరిశ్రమలో ప్రతికూల పరిస్థితులను ఎదురించే ధైర్యం నా కుటుంబ నేపథ్యం వల్ల ఏర్పడింది. నా కుటుంబం నుంచి నాకు మంచి సపోర్ట్ ఉండటం వల్ల నేను ఈ స్థాయికి చేరుకొన్నాను అని ప్రియాంక వెల్లడించింది.ఇటీవల ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ అనే రియాల్టీ షోలో మాట్లాడుతూ.. వేషాల కోసం పడక గదిలోకి వెళ్లే సమస్య కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లు అనుభవించారు. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు జాడ్యం ఆడ, మగ అనే తేడా లేకుండా ఉంటుంది అని ప్రియాంక చెప్పింది.హర్వే వెయిన్‌స్టెయిన్ మాదిరిగా బాలీవుడ్‌లో ఎవరూ లేరా అని రచయిత శోభాడే అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానమిస్తూ.. ఆ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతున్నావు.. ఆ వివాదంలోకి నన్ను లాగవద్దు అని అన్నారు.మీటూ అనే హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. హర్వే పాల్పడిన వేధింపులపై అందరూ గళం విప్పారు. అది కేవలం అమెరికాలోనే కాకుండా అన్ని దేశాలకు అది విస్తరించింది.











Comments