బిల్డింగ్ కట్టడానికి పునాదులు తవ్వారు..దొరికింది చూసి షాక్ అయిన స్థానికులు
ఓ భారీ భవన సముదాయాన్ని కట్టడానికి అన్ని
ఏర్పాట్లు పూర్తి చేసిందో నిర్మాణ సంస్థ. పునాదుల తవ్వకాన్ని మొదలు పెట్టింది. భారీ భవనం
కావడంతో 20 అడుగులకు
పైగానే పునాదులను తవ్వుతుండగా.. వారి కంటికి కనిపించింది చూసి బిత్తరపోయారు.
అవి డైనోసార్ల గుడ్లు. శిలాజ రూపంలో లభించాయి. ఒకేచోట కుప్పలుగా కనిపించాయి.
నాలుగో, అయిదో
కాదు.. 20కి పైగా
డైనోసార్ల గుడ్లు శిలాజరూపంలో కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని
పురాతత్వ శాఖకు పంపించారు. ఈ ఘటన చైనాలోని ఝియాంగ్ఝి ప్రావిన్స్‌లో చోటు
చేసుకుంది. ఈ ప్రావిన్స్‌లోని దాయు కంట్రీలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఓ భవన సముదాయాన్ని
నిర్మించడానికి పునాదులు తవ్వుతుండగా.. అవి వెలుగులోకి వచ్చాయి. పునాదులు తవ్వుతుండగా
అడ్డొచ్చిన బండరాళ్లను తొలగిస్తుంటే ఇవి బయటికి వచ్చాయట. ఇవి దాదాపు 13 కోట్ల సంవత్సరాల కిందటివని పురావస్తు శాఖ అంచనా వేసింది.
Comments
Post a Comment