కోలీవుడ్ లో సమంతకు చీప్ పేర్లు !! కారణం ఏంటి?

 కోలీవుడ్ లో సమంతకు చీప్ పేర్లు !! కారణం ఏంటి?


టాప్ హీరోయిన్ సమంత. ఈమెని టాలీవుడ్ ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో అందరికి తెలిసిందే. ఆమె న్యాచురల్ గా ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే సమంత మాత్రం ఒక నటిగా అన్ని తరహా పాత్రలను చేయాలనీ తనకు నచ్చిన పాత్రలను చేసింది. మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన అమ్మడు కొన్ని సినిమాలకే రూట్ మార్చేసింది. గ్లామర్ క్యారెక్టర్స్ కి కూడా ఎక్కువగా ఓటేసింది.

టాలీవుడ్ లో ఓ రకంగా మంచి పాత్రలే అందుతున్నా కోలీవుడ్ లో మాత్రం కొంచెం డిఫెరెంట్ గా కనిపిస్తోంది. ఇక సమంత పెళ్లి తరువాత అలాంటి రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్స్ జోలికి వెళ్లకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తోంది. ముఖ్యంగా రాజు గారి గది 2 సినిమాలో ఎలాంటి పాత్ర చేసిందో అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం చేస్తోన్న రంగస్థలం సినిమాలో ఒక పేదింటి అమ్మాయిలా లంగా ఓణిలో కనిపించింది. ఆ ఫొటోస్ లీక్ అయ్యి ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే టాలీవుడ్ వరకు బాగానే ఉంది కానీ కోలీవుడ్ లో సమంత పాత్రల పేర్లు బి గ్రేడ్ మూవీలకు వాడే పేర్లు ఉండడం గమనార్హం.


రీసెంట్ గా విక్రమ్ తో తీసిన టెన్ అనే సినిమాలో అమ్మడి పేరు షకీలా అని పెట్టారు. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న విశాల్ సినిమలో సమంత పేరు రతీదేవి అని పోస్టర్ ద్వారా చెప్పేశారు. ఈ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ పేర్లను వింటుంటే అప్పట్లో మలయాళం బి గ్రేడ్ మూవీలకు.. ముఖ్యంగా అప్పటి సాఫ్ట్ పోర్న్ స్టార్ షకీలా సినిమాకు ఈ పేర్లు ఉండేవని మనం గమనించవచ్చు. ముఖ్యంగా రతి దేవి అనే నేమ్ అయితే చాలా ఘాటైన పదం. అసలు సమంతకు ఇలాంటి బి గ్రేడ్ నేమ్స్ ఈ తమిళం బాబులు ఎందుకు పెడుతున్నారు?


Comments