హలో హీరోయిన్ “కళ్యాణి ప్రియదర్శన్” గురించి మీకు తెలుసా..? హీరోయిన్ కంటే ముందు ఏం చేసిందో !


హలో హీరోయిన్ “కళ్యాణి ప్రియదర్శన్” గురించి మీకు తెలుసా..? హీరోయిన్ కంటే ముందు ఏం చేసిందో !


కళ్యాణి ప్రియదర్శన్ తల్లిదండ్రలు ఎవరో కాదు ఫేమస్ డైరెక్టర్ ప్రియదర్శన్,అప్పట్లో హీరోయిన్ గా వెలుగొందిన లిజి ల గారాలపట్టియే ఈ కళ్యాణి..
లిజి ఆత్మబందువు,20వ శతాబ్దం సినిమా ద్వారా మనకు పరిచయమే..ఇప్పుడు నితిన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు..ప్రియదర్శన్ మళయాలి దర్శకుడు,బాలివుడ్లో కూడా సినిమాలు తీశారు..
సినిమాల్లోకి రావడానికి ముందు సింగపూర్,న్యూయార్క్ సిటిలలో చదువుకుంది కళ్యాణి..ఈమెకు ఒక సోదరుడున్నాడు..పేరు సిద్దార్ద్ ప్రియదర్శన్.
హీరోయిన్ గా కళ్యాణికి హలో తొలి సినిమా..హీరోయిన్ కావడం కన్నా ముందు కళ్యాణి సినిమాల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.సాబుసిరిల్ దగ్గర అసిస్టెంట్ గా క్రిష్ సినిమాకు పనిచేసింది..విక్రమ్,నయన్ నటించిన ఇరుమగన్ కూడా వర్క్ చేసింది.
ఒకప్పుడు చాాలా లావుగా ఉండే కళ్యాణి సినిమాల్లో హీరోయిన్ అవ్వడం కోసం పాతిక కిలోలు తగ్గింది..
నజ్రియా అంటే కళ్యాణికి బాగా ఇష్టం..హిందీలో ఆలియా,దీపికా అంటే ఇష్టమట..మళయాళి నటుడు మోహన్ లాల్ నటన అంటే పిచ్చట కళ్యాణికి..నజీరుద్దిన్ షా,మోహన్ లాల్ సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తుంది..
 తన తల్లి లిజితో కలిసి నటించే అవకాశం వస్తే తప్పక చేస్తా అంటున్న కళ్యాణి ..తన తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతుందట.






Comments