చెప్పులు కొట్టేసిన పాకిస్థాన్.. ఏమని అంటోందో తెలుసా..?
పాకిస్థాన్
కు వెళ్ళిన కుల్ భూషణ్ జాదవ్ భార్యను, తల్లిని
అక్కడి అధికారులు మీడియా ఎంతగానో హింసించారు. మంగళసూత్రాలు కూడా తీసేయించడమే
కాకుండా వారి చెప్పులు కూడా లాగేసుకున్నారు. జాదవ్ భార్య వేసుకున్న షూలను కనీసం
తిరిగి ఇవ్వనుకూడా లేదు పాకిస్థాన్.. అందుకే ఇప్పుడు నేషనల్ మీడియాలో చెప్పల్
చోర్(చెప్పుల దొంగ) పాకిస్థాన్ అంటూ అంటున్నారు. అయితే పాక్ ఇప్పుడు వారిపై
మరిన్ని ఆరోపణలు చేస్తోంది. ఆమె ధరించిన పాదరక్షలలో కెమెరా పెట్టుకొని వచ్చిందని
అందుకే వాటిని తీసుకున్నారని అక్కడి మీడియా కొత్త కొత్త వార్తలను వండుతోంది.
ఆ బూట్లలో లోహపదార్థం ఉన్నట్లు గుర్తించారని, ఈ
విషయాన్నిపాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పినట్టు పాక్ మీడియాలో కథనాలు
వెలువడుతున్నాయి. జాదవ్ భార్య ధరించిన బూట్లలో గుర్తించిన లోహపదార్థం కెమెరా లేదా
రికార్డింగ్ చిప్ అయి ఉంటుందని,
ఫోరెన్సిక్
ల్యాబ్ కు పంపించామని మహ్మద్ ఫైజల్ మీడియాకు తెలిపారు. పాకిస్థాన్ జైల్లో
ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య నేతన్ కుల్ జాదవ్ వెళ్ళారు.
కులభూషణ్ ను కలిసి తిరిగి అక్కడి నుంచి వచ్చే సమయంలో జాదవ్ భార్య ధరించిన బూట్లను
పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Post a Comment